Divorce: విడాకులు తీసుకుంటున్న మరో సెలబ్రిటీ .. పెళ్లైన ఏడాదికే బ్రేకప్..!

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.

 Divorce:

భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

 Divorce:

తాజాగా ఈ జబితాలోకి మరో సూపర్ స్టార్ వచ్చి చేరింది. ఆమె మరెవ్వరో కాదు.. '' ప్రిన్సెస్ ఆఫ్ పాప్‌''గా గుర్తింపు తెచ్చుకున్న బ్రిట్నీ స్పియర్స్. పాప్ సింగర్‌గా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్రిట్నీ స్పియర్స్ విడాకులకు రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే...బ్రిట్నీ స్పియర్స్ ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. తాజాగా ఈ అమ్మడు విడాకులకు సిద్దం అవుతుంది. 2022లో అస్ఘరీని అనే వ్యక్తిని బ్రిట్నీ స్పియర్స్ ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు వీరిద్దరు ఆరేళ్లపాటు డేటింగ్‌లో కూడా చేశారు.

 Divorce:

2022లో కొత్త మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసిన బ్రిట్నీ స్పియర్స్ 14 నెలలకే ఆమె విడాకులకు సిద్దం అయింది. బ్రిట్నీ స్పియర్స్ భర్త అస్ఘరీ ఆమె కన్నా 12 ఏళ్ల చిన్నవాడు కావడం విశేషం. అయితే బ్రిట్నీ స్పియర్స్‌కి ఇది మొదటి వివాహం కాదు. దీని కన్నా ముందు ఆమె రెండు వివాహాలు చేసుకుంది. 2004లో తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ని తొలి వివాహం చేసుకందామె. తరువాత అలెగ్జాండర్‌‌కి విడాకులు ఇచ్చి ..అమెరికన్ డాన్సర్, యాక్టర్, మోడల్ అయిన కెవిన్ ఫెడెర్‌లైన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగినప్పటికీ ...2007లో వీరిద్దరూ విడిపోయారు.

 Divorce:

దీంతో చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్న బ్రిట్నీ స్పియర్స్.. 15 సంవత్సరాల తరువాత, 2022లో అస్ఘరీతో వివాహం చేసుకుని, వైవాహిక జీవితాన్ని మళ్లి ఫ్రెష్‌గా మొదలుపెట్టింది.అయితే బ్రిట్నీ మూడో వివాహం కూడా ఎక్కువు రోజులు నిలవలేదు. బ్రిట్నీ స్పియర్స్- అస్ఘరీల మధ్య విభేదాలు తలెత్తడంతో.. ఈ జంట విడాకులకు సిద్దం అయినట్టుగా ప్రకటించారు.

విడాకులపై బ్రిట్నీ స్పియర్స్ భర్త అస్ఘరీ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. "ఆరు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రేమ మరియు ఒక సంవత్సరం పెళ్లి తర్వాత నేను నా భార్య ఈ బంధాన్ని ఇక్కడితో ఆపేయడానికి నిర్ణయించుకున్నాము" అని అస్ఘరీ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. విడాకులపై బ్రిట్నీ కూడా స్పందించారు. నేను కొత్త గుర్రాన్ని వెతకాలంటూ ఓ పోస్టు పెట్టిందామె. దీంతో బ్రిట్నీ స్పియర్స్ మూడో వివాహం కూడా పెటాకులు అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+