ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికిన ఏపీ ఆర్టీసీ సంఘాలు.. ప్రజా వ్యతిరేకత రాకుండా ఐకాస ప్రయత్నం
గత అర్థరాత్రీ నుండి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మీకులు పోరాటాన్ని ఉదృతం చేసేందుకు సన్నద్దమయ్యారు. పండగ సంధర్భంలో సమ్మె చేస్తున్న కార్మికులపై వ్యతిరేకత రాకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. దసరా పండగ సమయంలో కార్మీకులు సమ్మెకు దిగడంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో కార్మీక సంఘాలు, ఇతర పార్టీల మద్దతు పొందెందుకు కార్మీకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇతర ట్రేడ్ యూనియన్లతో పాటు పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

సమ్మెను ఉదృతం చేయనున్న కార్మికులు
తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకునే దసరా పండగ సమయంలో ఆర్టీసీ కార్మీకులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.. దీంతో వారిపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లపై సానూకూలత ప్రకటించిన ప్రభుత్వం కార్మికులు దిగిరాకపోవడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్దమయ్యారు. అయితే ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకత చర్యలు అనుగుణంగా సమ్మెను విజయ వంతం చేసేందుకు కార్మీకులు సైతం పావులు కదుపుతున్నారు.

ట్రేడ్ యూనియన్లతో సమావేశం కానున్న ఐకాస
ముఖ్యంగా పండగ సందర్భంలో కార్మీకులు సమ్మెకు పోవడంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్న ఇంతపెద్ద పండగకు కార్మీకులు సహకరించకపోవడంపై పలు విమర్శలు తలెత్తున్నాయి. దీంతో తమ పోరాటానికి ఇతర ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి, మరియు ఇతర రాజకీయ పార్టీల మద్దతు తీసుకునేందుకు ఆదివారం సమావేశం కానున్నాయి. మరోవైపు పలు ప్రజాసంఘాల మద్దతును కూడ కూడగట్టేందుకు ఆర్టీసీ ఐకాస ప్రయత్నాలు చేస్తోంది. మరో కార్మీకులను విధుల్లో నుండి తొలగించాలంటే ముందుగా తనను ఉద్యోగం నుండి తోలగించాలని ఐకాస కన్వీనర్ అశ్వథ్తామా రెడ్డి సవాల్ విసిరారు.

మద్దతు ప్రకటించిన ఏపీ కార్మిక సంఘం
ఈనేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు చేస్తున్న సమ్మెకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికిన నేపథ్యంలోనే ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడ వారికి మద్దతు ప్రకటించారు.ఈ సంధర్భంగా ఈయూ నేత వైవీరావు మీడియాతో మాట్లాడారు కార్మీకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ముప్పై రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించకుండా కేవలం అయిదు రోజుల ముందే కమీటీ వేయడంపై ఆయన ప్రశ్నించారు. అదికూడ సమస్యలు పరిష్కరించేందుకు కాకుండా సమ్మెను విరమింప చేసేందుకు వేయడం కరెక్టు కాదని అన్నారు.












Click it and Unblock the Notifications