హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగాలు: జీతం రూ. 60 వేల పైనే
హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో మరోసారి భారీ జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ట్రావెల్ అసిస్టెంట్, నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా అసిస్టెంట్ ఉద్యోగాల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 2 ఉన్నాయి. ఈ ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ట్రావెల్ అసిస్టెంట్ పోస్టు అర్హతలు:
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రావెలింగ్, హాస్పిటాలిటీ పరిశ్రమలో కనీసం మూడేళ్లు అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థులు వివిధ ఎయిర్ లైన్స్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. ఎయిర్ లేదా రైలు టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్ లపై ప్రభుత్వం విధించే పన్నులపై అవగాహన కలిగి ఉండాలి. అంతేగాక, ఇమ్మిగ్రేషన్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇండియన్ కస్టమ్స్ లలో పనిచేసిన అనుభవం ఉండాలి.

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అసిస్టెంట్ పోస్టు అర్హతలు:
ఈ పోస్టుకు హైస్కూల్ పూర్తి చేసిన వారు అర్హులు. అయితే, వీరు తప్పనిసరిగా ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అంతేగాక, ఒరియాలో కూడా మాట్లాడటం, చదవడం, రాయడం వంటి నైపుణ్యం కలిగి ఉండాలి.
జీతం వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో ఈ రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 7,35,015 చెల్లిస్తారు. అంతేగాక, పనిగంటలు వారానికి 40 గంటలే ఉండటం గమనార్హం.
దరఖాస్తు:
ఈ రెండు పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలు, దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్
https://in.usembassy.gov/embassy-consulates/hyderabad/ ను సంప్రదించండి.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్‌పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications