Rains: హైదరాబాద్‍లో రాత్రి నుంచి వర్షం.. రోడ్లపైకొచ్చిన నీరు.. ట్రాఫిక్‍కు అంతరాయం..
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాదా లోనూ వానలు పడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరవ్యాప్తంగా జల్లులు పడుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, నాగోల్, ఉప్పల్, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, ఛాదర్ ఘాట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్, మెహదీపట్నం, కొండాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, ఎస్సాఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మోతినగర్ రాత్రి నుంచి జల్లులు పడుతున్నాయి.
పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ఆఫీస్, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌పై అల్పపీడనం.. మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయని వివరించింది. బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వర్షాలు మరింత పెరుగుతాయని భావిస్తోంది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
అయితే తెలంగాణలో ఇప్పటికీ వర్షపాతలోటు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఇప్పటికీ కూడా వరద ప్రవాహం లేదని తెలిపారు. అటు ఆంధ్రపదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తేలిపాటి వానలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications