నీహారికకు రెండో వివాహం కలిసిరాదు.. వేణుస్వామి కామెంట్స్

వేణుస్వామి.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు లేరు. సినిమా రంగంలో ఉండేవారికి, రాజకీయ రంగంలో ఉండేవారికి భవిష్యత్తులో ఏం జరగబోతోందో పబ్లిక్ గా చెప్పేవారు. సెలబ్రిటీల జాతకాలను చెప్పడంతో ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు. నాగచైతన్య, సమంత వివాహం జరిగిన తర్వాత వారు ఎక్కువకాలం కలిసివుండరని చెప్పారు.

ఆయన చెప్పినట్లుగానే వారిద్దరూ విడిపోవడంతో వేణుస్వామి పేరు మార్మోగిపోతోంది. అంతేకాదు.. ఆయన ఎవరి గురించి ఏం చెప్పినా ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఒక హీరో కన్నుమూస్తాడని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తారకరత్న గుండెపోటుతో మరణించారు.

astrologer venu swamy comments on nagababu daughter niharika

ఈయనచేత పూజలు చేయించుకున్న రష్మిక, నిధి అగర్వాల్ లాంటివారు బిజీ హీరోయిన్లుగా మారారు. ఇటీవలే రామబాణం, ఖిలాడి చిత్రాల కథానాయిక డింపుల్ హయతి కూడా వేణుస్వామిచేత పూజలు చేయించుకుంది. పూజలు చేసే సమయంలో వైన్ బాటిల్స్ పెట్టడంపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ నడిచింది.

నాగబాబు కుమార్తె నీహారిక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం నీహారిక జీవితానికి సంబంధించిన వేణుస్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుున్న తర్వాత చిరంజీవి కూతురు శ్రీజ జీవితంలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు కలిసిరాదన్నారు. అమ్మగా పిలిపించుకునే అదృష్టం నీహారికకు లేదని, దోషానికి తగ్గ పరిహారం చేస్తే ఏమైనా ప్రయోజనం కనపడుతుందన్నారు.

'ఒక మనసు' సినిమాతో నీహారిక కెరీర్ ఆరంభించారు. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించినా అవి ఆమె కెరీర్ కి ప్లస్ కాలేదు. దీంతో విజయవంతమైన నిర్మాతగా నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+