Bajaj Freedom 125 CNG: హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చిన బజాజ్ సీఎన్జీ బైక్
బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్జీ బైక్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ లు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయి. బజాజ్ షో రూమ్ ల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సీఎన్జీ బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో బేసిక్ మోడల్ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డ్రమ్ ఎల్ఈడీ డిస్క్ వేరియంట్లు ఉన్నాయు. బేసిక్ వేరియంట్ ఎక్స్ షోరూం ప్రైస్ రూ. 94,999 గా ఉంది. డ్రమ్ ఎల్ఈడీ రూ.1.05 లక్షలుగా ఉంది.
డ్రమ్ ఎల్ఈడీ డిస్క్ ఎక్స్ షోరూ ధర రూ. 1.10 లక్షలు ఉంది. ఇది ఆన్ రోడ్ వచ్చేసారికి రూ.1.39 లక్షలుగా ఉంది. ఇక డ్రమ్ ఎల్ఈడీ ఆన్ రోడ్ రూ. 1.30 లక్షలుగా ఉంది. ఈ బైక్ లో రెండు కేజీల సీఎన్జీ ట్యాంక్, రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. పెట్రోల్ ట్యాంక్ మామూలు బైక్ లకు ఇచ్చినట్లుగానే ఉంది. ఇక సీఎన్జీ ట్యాంక్ సీట్ కింద ఇచ్చారు. పెట్రోల్, సీఎన్జీ కలిపి 330 కిలోమీటర్ల వరకు వెళ్తుందని చెబుతున్నారు. ఇందులో సీఎన్జీతో 200 కిలోమీటర్లకు పైగా నడుస్తోంది.

పెట్రోల్ తో 117 కిలోమీటర్ల పైగా వరకు వెళ్లొచ్చిన చెబుతున్నారు. సీఎన్జీ కిలోకు 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని.. పెట్రోల్ లీటర్ కు 64 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వివరిస్తున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ మంచి స్టైలిష్ లూక్ లో వచ్చింది. డిజిటల్ మీటర్ తో పాటు బ్లూ టూత్ కూడా కనెక్టు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. బైక్ ను పెట్రోల్, సీఎన్జీతో తీసుకొచ్చారు. దీని కారణం.. సీఎన్జీ అందుబాటులో లేని ప్రాంతంలో పెట్రోల్ బండి నడిచేందుకు ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు.
ప్రాంతాల్లో సీఎన్జీ అందుబాటులో ఉండదని.. అక్కడ పెట్రోల్ తో బండి నడుస్తుందని వివరిస్తున్నారు. బటన్ చేంజ్ చేయడంతో సీఎన్జీ నుంచి పెట్రోల్ మార్చుకోవచ్చని చెబుతున్నారు. పెట్రోల్ పోలిస్తే సీఎన్జీ ప్రైస్ తక్కువగా ఉంది. దీంతో ఖర్చు తగ్గించుకోవాలి అని అనుకునేవారు ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. అలాగే సిటీలో తిరిగేందుకు సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications