బండి సంజయ్... ఖైదీ నెంబర్ 7917

bandi sanjay areest: కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను కరీంనగర్ జిల్లా కారాగారంలో ఉంచారు. ఆయనకు రిమాండ్ లో ఉన్న ఖైదీలకు కేటాయించే నెంబరును కేటాయించారు. 7917 నెంబరుతోపాటు అందరు ఖైదీలతోపాటు సాధారణ బ్యారక్ ను కేటాయించారు.

తనకు ప్రభుత్వం నుంచి ప్రాణాపాయం ఉండటంతో తనకిచ్చే ఆహారంలో విషప్రయోగం జరిపే ప్రమాదం ఉందని సంజయ్ జడ్జికి విన్నవించుకోగా ఆయనకు జైలులో ఇవ్వాల్సిన ముందుగా తనిఖీ చేసిన తర్వాతే ఇవ్వాలని జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. సంజయ్ కోరినట్లుగానే కరీంనగర్ కారాగారానికి తరలించారు.

bandi sanjay in prision no 7917

ఆధారాలు లభించడంతోనే సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. తన స్నేహితుడి కోసమే ఓ మైనర్ విద్యార్థి ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చినా.. దాన్ని వాట్సప్ గ్రూప్ లోకి షేర్ అయిన తర్వాతే కుట్ర అమల్లోకి వచ్చిందని, అందుకు కారణం బండి సంజయ్ అని తేలడంతో ఏ1గా చేర్చామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+