గుడ్ బై: రాజకీయాలకు బండ్ల గణేశ్ వీడ్కోలు, ట్వీట్
కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక ప్రకటన చేశారు. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎందుకు తప్పుకుంటున్నాననో కూడా వివరించారు. ఏదైనా తప్పు చేస్తే క్షమించాలని కూడా కోరారు. సడెన్‌గా గణేశ్ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.

ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్, వ్యాపార పనుల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని బండ్ల గణేశ్ తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, లేదా మిత్రత్వం లేదని స్పష్టం చేశారు. తనకు అందరూ ఆత్మీయులేనని వివరించారు. అందరినీ సమానంగా చూస్తానని పేర్కొన్నారు.
ఇప్పటివరకు తన వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా బాధపడి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని బండ్ల గణేశ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది.ఆ తర్వాత బండ్ల గణేశ్ పెద్దగా రాజకీయాల్లో పాల్గొనలేదు.
Bandla Ganesh: రాజకీయాలకు రాం.. రాం.. బండ్ల గణేష్ కీలక నిర్ణయం#BandlaGanesh #politics #TeluguNews #TSNews #Hyderabad https://t.co/ytPgyghDt4
— Eenadu (@eenadulivenews) October 29, 2022
ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేశారు. దీంతో ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చారనే అంశంపై స్పష్టత లేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను బ్లేడ్ గణేశ్ అని కూడా అన్నారు. ఆ తర్వాత ఆ పేరు మరుగున పడింది.












Click it and Unblock the Notifications