హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలకు "బండ్ల" గుడ్‌బై..! నువ్వు పోతే కామెడీ ఎట్లన్నా..! నెట్టింట్లో కామెంట్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇక నేను ఏ పార్టీ కాదు: రాజకీయాలకు నిర్మాత బండ్ల గణేష్ గుడ్ బై! || Oneindia Telugu

హైదరాబాద్ : తెలుగు సినిమా కమెడియన్ గా బండ్ల గణేశ్ అందరికి తెలిసినోడే. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసి నిర్మాతగా మారారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటినుంచి ఆయన దూకుడుకు కళ్లెం లేదు. అధికారం కాంగ్రెస్ పార్టీదే అంటూ శపథాల మీద శపథాలు చేశారు.

ఎన్నికలకు ముందు హడావిడి చేసిన బండ్ల గణేశ్.. ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండిచ్చింది. అయితేనేం కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానంటూ గాంభీర్యం ప్రదర్శించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు.

అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ

అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేశ్ రాజకీయాల వైపు మళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల వేళ అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చారు. టీవీల్లో వచ్చిన బండ్ల గణేశ్ ఇంటర్వూలను పబ్లిక్ బాగా ఎంజాయ్ చేశారు. ఆయన మాట్లాడిన తీరు, ఆహార్యం, గాంభీర్యం కామెడీని తలదన్ని నవ్వులు పూయించింది.

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ గా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటాననే వ్యాఖ్యలు.. ఆ పార్టీకి వీరాభిమానిని అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికి జనాల చెవుల్లో మార్మోగుతూనే ఉండొచ్చు. అంతలా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా మారిన బండ్ల గణేశ్ సడెన్ గా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడం చర్చానీయాంశమైంది.

పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ నేత ! ఎందుకో తెలుసా ?పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ నేత ! ఎందుకో తెలుసా ?

6 నెలలు కాదు.. అంతలోనే

6 నెలలు కాదు.. అంతలోనే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న బండ్ల గణేశ్.. 6 నెలలు తిరక్కుండానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. "నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను.. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు.. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.. అంటూ ట్వీట్ చేశారు.

అధ్యక్షా.. గణేశుడి ఆశ..!

అధ్యక్షా.. గణేశుడి ఆశ..!

ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో కాంగ్రెస్ గూటికి చేరిన బండ్ల గణేశ్ కు ఆ అవకాశం దక్కలేదు. సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన పాచికలు పారలేదు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తూ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడారు. పార్టీ కోసం తాను బాగా కష్టపడుతున్నానని భావించి.. షాద్ నగర్, జూబ్లిహిల్స్ స్థానాల నుంచి టికెట్ రాకపోతుందా అని ఎదురుచూశారు. అయితే హైకమాండ్ మాత్రం హ్యాండిచ్చింది. మీడియాలో అతి చేశారనే కారణంతోనే ఆయన్ని పక్కనబెట్టారనే ప్రచారం కూడా జరిగింది.

కాంగ్రెస్ టు పీకే.. నెక్ట్స్ ఏంటో..!

కాంగ్రెస్ టు పీకే.. నెక్ట్స్ ఏంటో..!

జనసేనాని పవన్ కల్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ బండ్ల గణేశ్ గురువారం (04.04.2019) నాడు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నా బాస్, నా దైవం అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జనసేనాని గురించి మాట్లాడటంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వివరణ ఇవ్వాల్సి ఉందనుకున్నారో ఏమో గానీ సడెన్ గా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.

బండ్లన్నా.. నువ్వు పోతే ఎట్లన్నా..!

బండ్లన్నా.. నువ్వు పోతే ఎట్లన్నా..!

బండ్ల గణేశ్ పొలిటికల్ డ్రాప్ పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలు వద్దు సోదరా, ప్రశాంతమైన జీవితం వదులుకుని బురదలో కాలు పెట్టావని ఒకరంటే.. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నీకు 7'O క్లాక్ బ్లేడ్ కింద అయ్యిందా అన్నా.. అంటూ మరొకరు కామెంట్ చేశారు.

రాజకీయం తెలుసుకోవాలంటే నిజ జీవితంలో కూడా నటించాలి.. ఇక్కడ సినిమా నటన సరిపోదు భయ్యా!!... అంతకుమించి కావాలి.. అంటూ ఇంకొకరు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నా మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కామెడీ ఎవరు చేస్తారన్నా.. ఏదో ఒక పార్టీలో చేరన్నా.. నువ్వు వెళ్లకన్నా.. పోనీ, ఏపీలో కేఏ పాల్ తో జత కట్టు.. మీరిద్దరు కలిస్తే ఎవరూ ఆపలేరంటూ కామెంటారు మరో నెటిజన్.

English summary
Telugu Cinema Producer Bandla Ganesh announced that he left from politics. Before telangana assembly elections he joined with congress party and got tpcc spokes person cadre. Even it is not completed six months for his political entry, now he decided to good bye to politics. As per that He mentioned his sentences in twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X