హైదరాబాద్ బెగ్గింగ్ మాఫియా: వృద్ధులతో భిక్షాటన, రూ. వందలు ఇచ్చి వేలు సంపాదించాడు
హైదరాబాద్: నగరంలో బెగ్గింగ్ మాఫియాను ఛేదించారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. దీనికి సంబంధించిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద 23 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో భిక్షాటన చేయిస్తున్న బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోంకు తరలించినట్లు వెల్లడించారు.
నిర్వాహకుడిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెగ్గింగ్ నిర్వాహకుడు అనిల్ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పరిసర ప్రాంతాల్లో వారితో భిక్షాటన చేయిస్తున్నాడు.

యాచకులందరి నుంచి రోజుకు రూ. 4500 నుంచి 6000 వరకు తీసుకుంటాడు. దీనికి ప్రతిగా ఒక్కో బిచ్చగాడికి రోజుకు రూ. 200 కూలీగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో సిగ్నల్స్ వద్ద భిక్షాటనతో ఇబ్బందులకు గురైనవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక డ్రైవర్ నిర్వహించిన పోలీసులు.. ఈ బెగ్గింగ్ రాకెట్‌ను ఛేదించారు. మరికొద్ది రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగిస్తామని చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవర్ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, గతంలో కూడా హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా నడుస్తోందని ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పుడు దర్యాప్తు జరిపిన పోలీసులు అలాంటిదేం లేదని తేల్చారు. తాజాగా, ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications