Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss Telugu:ఈ సారి టైటిల్ మహిళలదేనా..బిగ్‌బాస్ ఆలోచన ఏంటి..తొలి స్థానంలో ఆ బ్యూటీ..?

బిగ్‌బాస్ తెలుగు చివరి వారంకు చేరుకుంది. డిసెంబర్ 20వ తేదీన బిగ్‌బాస్ ఫైనల్స్ జరగనున్నాయి. ఆ రోజు విజేత ఎవరో అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందే బిగ్‌బాస్ విజేత ఎవరు నిలుస్తారో అనేదానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. బిగ్‌బాస్ టైటిల్ విజేత రేసులో అభిజీత్ దూసుకెళుతుండగా... అందుకు అడ్డుకట్టవేసేందుకు మరో లేడీ కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్ ఏంటా వివరాలు..?

 బిగ్‌బాస్ విజేతపై జోరుగా చర్చ

బిగ్‌బాస్ విజేతపై జోరుగా చర్చ

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగింపుదశకు వచ్చింది. షో ప్రారంభమైన మొదట్లో కంటెస్టెంట్ల పరంగా ప్రేక్షకులు షో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత షో నిర్వాహకులు తమ ప్రణాళికను మార్చడంతో బిగ్‌బాస్ షో కాస్త ఆసక్తిని కలిగించింది. అనంతరం బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల మధ్య ఎమోషన్స్, సందడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చేసరికి బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు నాగార్జునపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఇవన్నీ పక్కన బెడితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేతపై జోరుగా చర్చ జరుగుతోంది.

 ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఓట్లు వెల్లువ

ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఓట్లు వెల్లువ

ఈ సారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ విజేతగా అభిజీత్ పేరు తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వస్తున్న లీకులు, ప్రచారం చూస్తే అభిజీత్‌ విన్నర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు అభిజీత్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ కూడా బాగా ఉంది. తన అభిమానులు సోషల్ మీడియాలో అలుపు లేకుండా ఓటింగ్ చేస్తున్నారు.అయితే ఇది బిగ్‌బాస్ హౌజ్ కనుక ఇక్కడ ఏమైనా జరిగే అవకాశాలున్నాయి. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ఎలా అయితే ఎలిమినేట్ అయ్యారో అలానే బలమైన కంటెస్టెంట్ కాకకుండా మరొకరు కూడా విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక చిన్న తప్పిదం చేస్తే చాలు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

 అభిజీత్‌ను వెనక్కు నెట్టేసిన అరియానా

అభిజీత్‌ను వెనక్కు నెట్టేసిన అరియానా

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు టైటిల్ రేసులో ఫేవరెట్‌గా ఉన్న అభిజీత్ ఒక్కసారిగా వెనకపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభిజీత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా మొదటి స్థానంలో అరియానా దూసుకెళ్లింది. దీంతో మళ్లీ బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. అంతేకాదు ఈ సారి లేడీ కంటెస్టెంట్‌ను విజేతగా ప్రకటించాలని బిగ్‌బాస్ షో నిర్వాహకులు కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అరియానా లేదా హారికాలు టైటిల్ ఎగురేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అభిజీత్ టైటిల్ విజేతగా నిలుస్తారని భావిస్తున్న వారి ఆశలన్నీ అడియాశలే అవుతాయి.

 అరియానా కోసం దేవీ నాగవల్లి, అవినాష్

అరియానా కోసం దేవీ నాగవల్లి, అవినాష్

ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు దేవీ నాగవల్లి, అవినాష్‌లు అరియానాకు మద్దతుగా నిలుస్తున్నారు. అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తనను తప్పకుండా గెలిపించాలని సోషల్ మీడియా వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే గత మూడు సీజన్లలో మగవారినే విజేతలుగా ప్రకటించడం, ఈ సారి మహిళలను విజేతగా ప్రకటించాలని సోషల్ మీడియాలో నెటిజెన్లు డిమాండ్ చేస్తుండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా వారివైపే మొగ్గు చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి ఇది బిగ్‌బాస్ హౌజ్ కనుక బండ్లు ఓడలు కావొచ్చు... ఓడలు బండ్లు కావొచ్చు అనే సంగతి మర్చిపోకూడదు. అంతా ఆశిస్తున్నట్లుగా అభిజీత్ టైటిల్ విన్నర్ కావొచ్చు లేదా మరొకరు ట్రోఫీని ఎగురేసుకుపోవచ్చు. ఎందుకంటే ఇది బిగ్‌బాస్... ఇక్కడ ఏమైనా జరగొచ్చు..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+