హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోవాలో బీజేపీ గట్టెక్కిందిలా.. అంతా కిషన్ రెడ్డి వ్యుహాం.. ప్రణాళిక ప్రకారమే..

|
Google Oneindia TeluguNews

4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో లెక్క.. ఆయా చోట్ల పరిస్థితులు/ కీలక నేతల పర్యవేక్షించారు. దీంతో బీజేపీ విజయం ఖరారు అయ్యింది. గోవాలో బీజేపికి గతంలో కంటే ఎక్కువ సీట్లు సొంతం చేసుకుంది. ప్రమోద్ సావంతే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సావంత్.. సాంకెలిమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

గోవాలో బీజేపీ సంఖ్య గతం కన్నా మెరుగుపడింది. ఇందులో కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్‌ రెడ్డి కీలక భూమిక పోషించారు. గోవా ఎన్నికల సహ ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న ఆయన, లోతుగా విశ్లేషణ చేశారు. గ్రామ స్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని, అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి.. పోస్టర్ల డిజైనింగ్‌, ప్రచారం తదితర అంశాల్ని దగ్గరుండి చూసుకున్నారు.

bjp won in goa because of kishan reddy

పర్యాటక మంత్రిగా అక్కడ అనేక కార్యమాలు చేపట్టారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వారిని చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో ముందున్నారు. గోవాలో క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండడంతో.. ఆ ఓట్లను ఆకర్షించేలా చర్యలు తీసుకున్నారు.

అసంతృప్తులను బుజ్జగించడం, ఓట్లు చీలకుండా అవసరమైన వారికి టికెట్లు ఇప్పించడం వంటి పనుల్లో ముందుండి నడిపించారు. మనోహర్‌ పారికర్‌ చనిపోయిన తర్వాత.. సీఎం ప్రమోద్‌ సావంత్‌పై కొందరు బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న కిషన్‌ రెడ్డి.. పరిస్థితులను అన్నింటినీ చక్కదిద్దడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. దీంతో అక్కడ వరసగా మూడోసారి కమల దళం వికసించింది.

English summary
bjp won in goa assembly elections because of central minister kishan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X