Hyderabad: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఇరకాటంలో బీఆర్ఎస్.. !
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు గ్రేటర్ లోని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. అరెకపూడి గాంధీని ఉద్దేశించి నువ్వు ఎక్కడో పుట్టి ఇక్కడకు వచ్చి నాకే సవాల్ విసురుతావా అని అన్నారు. దీంతో ఆ పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే.. కౌశిక్ రెడ్డికి సపోర్ట్ చేస్తే తము ప్రజలకు దూరమవుతారని భావిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉండటంతో ఎటు మాట్లాడినా ప్రాబ్లం అవుతుంది గబ్ చుప్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మాజీ మంత్రి మల్లా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సప్పుడు చేయడం లేదు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వివాదాలకు దూరంగానే ఉంటారు. దీంతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహరశైలి చర్చనీయాంశంగా మారింది. జిల్లా పార్టీ సమావేశాన్ని గాంధీ ఇంటిలో నిర్వహించుకుందామని పార్టీ పిలుపునిచ్చినా గ్రేటర్ ఎమ్మెల్యేలు ఎవరూ సరిగా స్పందించలేదు. కౌశిక్ రెడ్డి మాటలతో ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువ సీట్లు వచ్చాయి.

సెటిలర్లంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. అయితే కౌశిక్ రెడ్డి సెటిలర్లను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి ముఖ్యంగా.. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ ప్రభావం పడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 24 స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, అంబర్‌పేట, ఎల్‌బీనగర్, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఈ అంశం కనీసం మాట్లాడడం కూడా చేయలేదు. దీంతో కౌశిక్ రెడ్డి పార్టీలో ఒంటరయ్యడా అనే అనుమానం వస్తోంది.
మాజీ మంత్రి హరీశ్ రావు కౌశిక్ రెడ్డికి సపోర్ట్ గా నిలుస్తున్నాడు.ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత సీపీ ఆఫీస్ కు వెళ్లారు. ధర్నా కూడా చేశారు.












Click it and Unblock the Notifications