కొట్టుకొస్తోన్న కార్లు: బైకులు కూడా.. వీడియో వైరల్
వర్ష బీభత్సంతో హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. కాలనీలు, గల్లీలు వరదనీటితో నిండిపోయాయి. అయితే వరదనీటిలో కార్లు కూడా కొట్టుకువస్తోన్నాయి. తాజాగా భాగ్యనగరంలో అలా కార్లు కొట్టుకుపోతోన్న వీడియోలు కనిపించాయి. ఒక కారు వెనక మరో కారు.. అలా మూడు కార్లు ఆగిపోయాయి. ఈ వీడియోలను నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో తెగ ట్రోల్ అవుతోంది.
మంగళవారం రోజంతా వర్షం కురవడంతో రాత్రి వరకు వీధులన్నీ నదులను తలపించాయి. రాత్రిపూట పలు ప్రాంతాల్లో కార్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దమ్మాయిగూడలో ఇండ్ల మధ్య వరద నీరు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీలో కూడా రెండు వాహనాలు కొట్టుకుపోయాయి. కార్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక బైకుల సంగతి చెప్పక్కర్లేదు. వరద ప్రవాహంలో టూ వీలర్స్ కొట్టుకుపోతున్నాయి.

సెల్లార్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం వల్ల పాత ఇళ్లులు కూలిపోతున్నాయి. పాతబస్తీలో ఇల్లు కూలి పలువురు చనిపోయారు. శాలిబండలో హఠాత్తుగా ఓ ఇల్లు కూలింది. నడుచుకుంటూ వెళుతున్న మహిళపై గోడ పడింది. ఆ సమయంలో మహిళ పక్కకు పరుగెత్తింది. దీంతో ఆమె సేఫ్‌గా బయటపడింది.
కొట్టుకొస్తోన్న కార్లు: బైకులు కూడా.. వీడియో వైరల్#Rains #Hyderabad #Telangana pic.twitter.com/iooU9lsVVC
— oneindiatelugu (@oneindiatelugu) October 14, 2020












Click it and Unblock the Notifications