చికోటి చిట్టా: 7 దేశాల్లో క్యాసినో, అంతా ప్రముఖులే, ఇలా తరలింపు..?
చికోటి ప్రవీణ్ చిట్టా క్రమంగా బయటపడుతుంది. ఆయన ఒక్కో అంశం మెల్లిగా వెలుగులోకి వస్తోంది. ఆయన ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్ ల్యాండ్‌లో క్యాసినో నిర్వహించారని అధికారులు తేల్చారు. వెయ్యి మందికిపైగా విదేశాలకు తీసుకెళ్లి వారితో చికోటి ప్రవీణ్ క్యాసినో ఆడించినట్టు సమాచారం.

సినీ, రాజకీయ ప్రముఖులు
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారని తెలిసింది. చికోటి ప్రవీణ్ అనుచరుడు, ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ పలువురిని విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడేందుకు స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేశాడని అధికారులు గుర్తించారు. సంపత్ ఇంటి మీద కూడా అధికారులు దాడులు చేశారు. క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ అతడి అనుచరులు సంపత్, వెంకటేశ్, మాధవరెడ్డి, రాకేశ్, బబ్లూలకు ఈడీ నోటీసులు పంపింది.

డేటా..
సీజ్ చేసిన చికోటీ ప్రవీణ్ ల్యాప్ ట్యాప్, మొబైల్స్‌లో గల డేటాను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. అందుల్లోంచి సమాచారం సేకరిస్తున్నారని తెలుస్తోంది. చికోటి ప్రవీణ్ ఫ్రెండ్స్‌ను సోమవారం విచారణకు పిలిచారని తెలుస్తోంది. ప్రవీణ్ ల్యాప్ టాప్, మొబైల్స్ డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నారు.

హవాలా రూపంలో
హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తరలిస్తున్నారనే సమాచారంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. చికోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. సైదాబాద్ ఐఎస్‌సదన్, బోయిన్‌పల్లి, సిటీ శివారులోని కడ్తాల్.. 8 ప్రాంతాల్లో 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి ఆధారాలు సేకరించారు. చికోటి ప్రవీణ్ జూన్ నెలలో నేపాల్‌లో ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి 200 మంది వరకు హాజరయ్యారట. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 లక్షల వరకు వసూల్ చేశారు. అయితే టాలీవుడ్, బాలీవుడ్ తారలను తీసుకొచ్చారు. వారితో ఆడి, పాడించారు. అందుకు వారికి భారీ మొత్తం ముట్టజెప్పారని తెలిసింది. ఒక్కొక్కరికి వారి రేంజ్ బట్టి నగదు ఇచ్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications