సీఎం కేసీఆర్ ముసుగు తొలిగింది, అహం బయటపడింది : భట్టి

ఆర్టీసీ కథ ముగిసినట్టేనని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు, ప్రవైట్‌పరం చేయాలని సీఎం చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆర్టీసీ ఆయన వ్యక్తిగత ఆస్తి కాదని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం ద్వార ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు వచ్చాయని స్ఫష్టం చేశారు. సీఎం నిర్ణయంతో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయని హెచ్చరించారు.

 హుజుర్‌నగర్‌లో గెలిస్తే ఇంత అహంభావామా..?

హుజుర్‌నగర్‌లో గెలిస్తే ఇంత అహంభావామా..?

ఒక్క హుజుర్‌నగర్ ఎన్నికల్లో గెలవడం ద్వార సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటలో ఆహంభావం కనిపించిందని అన్నారు. సంయమనంతో వ్యవహరించాల్సిన సీఎం ఇలాంటీ మాటలను మాట్లాడాడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.ఇక సీఎం మాటల్లో ఆర్టీసీని తన గుప్పిట్లో పెట్టుకోవాలని లక్ష్యం తప్ప ఏంమార్పు లేదని అన్నారు. గతంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు సీఎం దృష్టికి తీసుకువద్దామని ప్రయత్నాలు చేస్తే బయటకు రాని సీఎం ఒక్క హుజుర్‌నగర్ ఎన్నికల్లో గెలవడం ద్వార బయటకు రావడం చాల భాదకరమని విమర్శించారు.

సీఎం కుట్రలో భాగమే సమ్మె

సీఎం కుట్రలో భాగమే సమ్మె


ఇక ప్రతి పక్షాలు చెబుతున్నట్టు ఆర్టీసీ అస్తులను అమ్మకాన్నికి పెట్టి, సంస్థ లేకుండా చేసేందుకు ఆయనే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెబాట పట్టించారని, తాము గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నిన్న మాట్లాడిన విధానంతో ఆయన వేసుకున్న ముసుగు తొలిగిపోయిందని అన్నారు. ఆర్టీసీని లేకుండా చేయాలనే కుట్ర కేసీఆర్‌ మనసులో ఉందని అన్నారు. దాన్ని ఆయన మాటల ద్వార బయటపెట్టాడని అన్నారు. దీని వెనక పెద్ద కుట్రగా దాగి ఉందని అన్నారు.

కార్మికుల కడుపుకాలితే... సీఎంకు పనికి మాలిన సమ్మెగా కనబడుతోంది

కార్మికుల కడుపుకాలితే... సీఎంకు పనికి మాలిన సమ్మెగా కనబడుతోంది


కడుపు కాలి ఆకలితో ఉన్న కార్మికుడు సమ్మెకు పోతే... అది సీఎంకు పనికి మాలిన సమ్మెగా కనిపించడం దురదృష్టకరమని అన్నారు. అయితే అణగారిన వర్గాలను తొక్కిపెట్టే మనస్తత్వంతో ఉన్న సీఎం కేసీఆర్‌కు, కార్మికులు చేసే సమ్మె అదే విధంగా కనబడడంలో పెద్దగా ఆశ్ఛర్యం లేదని అవేదన వ్యక్తం చేశారు.. దేశంలో అసమానతలు పెరిగిపోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా తన ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటీ సంధర్భంలో సీఎం నిర్ణయాలను ప్రజా సంక్షేమం కోరుకునే ఎవ్వరు కూడ పరిస్థితి ఉండదని అన్నారు.కోర్టు కూడ కార్మికులకు ఉపయోగపడే విధంగా పలు ఆదేశాలు జారీ చేసిందని, వారి డిమాండ్లు న్యాయపరమైనవనే పేర్కోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+