Hyderabad: రోడ్డు ప్రమాదానికి కారణమైన కమెడియన్ అరెస్ట్.. !

రోడ్డు ప్రమాదానికి కారణమైన స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 33 ఏళ్ల ఉత్సవ్ దీక్షిత్ పోర్షే కారును వేగంగా నడుపుతూ కేబీఆర్ పార్క్ గ్రిల్‌ను ఢీకొట్టాడు. అనంతరం కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల్లో పోర్షే కారును హాస్యనటుడు ఉత్సవ్ దీక్షిత్ నడుపుతున్నట్లు గుర్తించారు.

బంజారాహిల్స్ పోలీసులు ఆ వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీక్షిత్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విలాసవంతమైన కారు బానెట్ తీవ్రంగా దెబ్బతింది. ఉత్సవ్ దీక్షిత్ పై బంజారాహిల్స్ పోలీసుల సెక్షన్ 110, 281 BNS సెక్షన్ 184 MV చట్టం & సెక్షన్ 3 PDPP చట్టం కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సనాహితలోని సెక్షన్ 106 కింద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కేసు నమోదు చేశారు.

Comedian Utsav Dixit has been arrested by police for causing a road accident at KBR Park

ఉత్సవ్ దీక్షిత్ స్టాండప్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నవంబర్‌ 1శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో ఫిలింనగర్‌ వైపు నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 10 వైపునకు కారులో వేగంగా వచ్చి గోడను గుద్దాడు. కళింగ చౌరస్తా నుంచి క్యాన్సర్‌ అస్పత్రి వైపునకు వెళ్తున్న కారు యూటర్న్‌ సమీపంలో ప్రమాదరకమైన మలుపు వద్ద అదుపు తప్పినట్లు తెలిసింది. కేబీఆర్‌ పార్కు బయట ప్రహరీని, గ్రిల్స్‌ను ఢీకొట్టింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 6లో నివాసముంటున్న ఉత్సవ్‌ దీక్షిత్‌ ప్లాస్టిక్‌ కంపెనీకి ఎండీగా కూడా ఉన్నాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+