సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సిత్రాలు: మూడు పెళ్లిళ్లు చేసుకున్న శంకరయ్య, రెండో భార్య శారద ఫిర్యాదుతో..

హిందు సంప్రదాయం ప్రకారం స్త్రీ/పురుషుడు ఒకరినీ మాత్రమే పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఉంది. సనాతన ధర్మం ప్రకారం ఓకే మాట, ఓకే భార్య అనే అనవాయితీ కొనసాగుతోంది. ఆధునిక కాలంలో మాత్రం తీరుమారడం లేదు. కొందరు మాత్రం రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నిత్య పెళ్లిళ్లకు సంబంధించి ప్రతీరోజు వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే నలుగురికి మంచి చెప్పాల్సిన స్థానంలో ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మూడు పెళ్లిళ్ల భాగోతం హైదరాబాద్ నడిబొడ్డున వెలుగుచూసింది.

శంకరయ్య అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వనస్థలిపురం పరిధిలో గల సహారా ఎస్టేట్ గాంధార అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. 2011లో ఓ మహిళను పెళ్లి చేసుకొని.. తర్వాత వదిలేశాడు. ఇప్పటివరకు ఏ సమస్య లేదు కానీ తర్వాత ఇబ్బందులు వచ్చాయి. 2016లో శారద అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పాప కూడా జన్మించింది. తర్వాత శారదతో శంకరయ్యకు పడటం లేదు. ఇదే క్రమంలో ఆయన బదిలీ కూడా అయ్యాడు. దీనినే అదనుగా భావించి.. మరో పెళ్లి చేసుకున్నాడు. దీనిని రెండో భార్య తెలుసుకోవడంతో విషయం తెలిసింది.

crpf constable sankaraiah arrested for third marriage

వాస్తవానికి గతేడాది నవంబర్ 30వ తేదీన సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజూలారాణిని పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌లో కాక.. తిరుపతిలో రహస్యంగా మనువడాడు. తర్వాత మెల్లిగా శారదకు విషయం తెలిసింది. దీంతో ఆమె వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శంకరయ్యను అరెస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ఇదేం పాడు బుద్ది అని కౌన్సెలింగ్ ఇచ్చారు. శంకరయ్యను రిమాండ్‌కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+