24 లక్షలు హుష్‌కాకీ.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో.. తల పట్టుకున్న మహిళ
దొంగకు పది దారులు అన్నట్టు.. మోసం చేసే వారికి అన్నీ దారులే.. ఇక సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయి. ఓటీపీ చెప్పొద్దు అని పోలీసులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. అవగాహన కల్పిస్తున్నారు. క్యూ ఆర్ కోడ్ కూడా స్కాన్ చేయొద్దని సూచిస్తున్నారు. కానీ కొందరు.. ఏదో మాయలో పడి అలా చేసేస్తున్నారు. దీంతో జరగాల్సిన నష్టం జరుగుతుంది. హైదరాబాద్‌లో ఓ వివాహిత కూడా అలానే నష్టపోయారు. పెద్ద మొత్తంలో నగదును కోల్పోయారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఓఎల్ఎక్స్‌లో వస్తువు కొనే సమయంలో ఘటన జరిగింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఇటీవలే భర్త చనిపోయాడు. ఒంటరిగానే ఉంటుంది. ఆమె OLXలో ఓ వస్తువు అమ్మకానికి పెట్టింది. వస్తువు అమ్మి ఆ మహిళ సొమ్ముచేసుకోవాలని అనుకుంది. ఇప్పుడు ఉన్న డబ్బును పోగొట్టుకుంది. బోరుమని విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

మహిళతో కంత్రీగాళ్లు చాట్ చేశారు. తర్వాత కూడా కాల్ చేశారు. వస్తువు కొనుగోలుకు సంబంధించి అని నమ్మించారు. తర్వాత క్యూ ఆర్ కోడ్‌ను పంపారు.. దాన్ని స్కాన్ చేయాలని సూచించడంతో.. ఆమె దాన్ని స్కాన్ చేసింది. అలా చేయడమే తప్పయిపోయింది. వెంటనే బ్యాంక్ ఎకౌంట్ నుంచి 2 లక్షలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆమె కంగారు పడిపోయింది. అదే నెంబర్‌కు కాల్ చేసి విషయం చెప్పింది. మళ్లీ స్కాన్ చేయాలని చెప్పారు. డబ్బు తిరిగి వస్తుందని అనడంతో మళ్లీ నమ్మింది. కానీ లాభం లేదు. ఎందుకంటే మహిళ మళ్లీ స్కాన్ చేయడంతో ఉన్న నగదు మొత్తం హుష్ ఖాకీ అయిపోయింది. క్షణంలో మిగతా 22 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయిపోయాయి.












Click it and Unblock the Notifications