Dil Raju: అయ్య బాబోయ్.. దిల్ రాజుకు ఇన్ని తెలివి తేటలా? వామ్మో!!
అన్ని తెలివితేటలు లేకపోతే అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా ఎలా ఎదగగలుగుతారు? ఆ మాత్రం ఉండాల్సిందే.. దిల్ రాజు గురించే ఇదంతా. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఆ పరిస్థితులకు మనం తలొగ్గి ఉండాలి. ఇది ప్రకృతి ధర్మంగా వచ్చే సూత్రం. దిల్ రాజు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. విజయాల్ని సాధిస్తున్నారు.

ఎఫ్ 3కి సాధారణ టికెట్ ధరలే
ప్రభుత్వాలతో మాట్లాడుకున్న భారీచిత్రాల నిర్మాతలు థియేటర్ టికెట్ ధరలు పెంచుకోగలిగారు. కానీ ఆ ధరలు పెంచిన తర్వాత మొదటికే మోసం వచ్చింది. సాధారణంగా థియేటర్‌కు వచ్చేవారు కూడా రావడం మానేశారు. గతంలో సినిమా ఎంత ఫ్లాపైనా కనీస కలెక్షన్లు వచ్చేవి. టికెట్ ధరల దెబ్బకు మొదటిరోజు, మొదటి ఆటకు ఫ్లాప్ అంటే చాలు.. ఎంత పెద్ద అగ్ర కథానాయకుడి సినిమా అయినా గోవిందా.. గోవింద అవ్వాల్సిందే.!! దీన్ని దృష్టిలో ఉంచుకునే తమ సినిమాకు టికెట్ ధరలు పెంచడం లేదని, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడొచ్చంటూ దిల్ రాజు ప్రచారం చేస్తున్నారు.

కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు రావాలి
తన సినిమా ప్రేక్షకులకు భారం కాకూడదని, థియేటర్లకు రావాలని, ఈ వేసవి సీజన్‌లో అతి పెద్ద హిట్ కొట్టాలనే కసితో దిల్ రాజు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో బెనిఫిట్ షో పడగానే సినిమా హిట్టా? ఫట్టా? అనేది వెంటనే తెలిసిపోతుంది. దానికంటే ముందుగా విదేశాల్లో వేసే ప్రీమియర్ షోలతో కూడా సినిమా ఎలా ఉందనేది క్షణాల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వార్తలను కట్టడి చేయాలని దిల్ రాజు భావించారు.

నెగెటివ్ టాక్ వస్తే వసూళ్లపై ప్రభావం
షోకు నెగెటివ్ టాక్ వస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు వేయడంలేదు. అలాగే అమెరికాలోను అర్థరాత్రి షోలు పడతాయి. తెల్లవారేసరికి టాక్ తెలిసిపోతుంది. అందుకనే అమెరికాలో కూడా తెల్లవారే షోలు వేస్తున్నారు. భారత్‌లోను, ఇతర దేశాల్లోను ఎఫ్ 3 సినిమా ఒకే సమయానికి షోలు వేసేలా దిల్ రాజు ప్రణాళిక వేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఏమైనప్పటికీ ఒక సినిమా గురించి నిర్మాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు దిల్ రాజు తీసుకుంటున్నారు. ఒకప్పుడు డి.రామానాయుడు మాత్రమే ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేవారని, ఇప్పుడు అటువంటి తరహా పనితీరు దిల్ రాజువద్ద చూస్తున్నామంటున్నారు పలువురు జూనియర్ నిర్మాతలు.












Click it and Unblock the Notifications