Disha case encounter : ఎన్ కౌంటర్ లకు తాను వ్యతిరేకం అంటున్న అసదుద్దీన్ ఓవైసీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. ఇక దీనిపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తే పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా చట్ట ప్రకారం జరగాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణా పోలీసులకు నోటీసులు ఇచ్చింది. అంతే కాదు ఎన్ కౌంటర్ మృతుల మృత దేహాలను 9వ తేదీ వరకు భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. తాము పరిశీలించే వరకు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది.
ఇది ఇలా ఉంటే షాద్ నగర్ చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ పై వ్యతిరేకత ఇంకా వ్యక్తం అవుతూనే ఉంది.కొందరు ప్రముఖులు ఈ చర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య తప్పంటున్నారు. వెటర్నరీ డాక్టర్ దిశను హైదరాబాద్ శివార్లలో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా హతమార్చిన ఘటనలో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టారు. అయితే తాను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకమని, శిక్షించే బాధ్యతను న్యాయస్థానానికి అప్పగించాలే తప్పా పోలీసుల చేతుల్లోకి తీసుకోకూడదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇకపోతే దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరుపుతుందని, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం కూడా విచారణ జరుపుతుందని తాను భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications