Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఠారెత్తిస్తోన్న ఎండలు.. విద్యుత్ వినియోగం హై.. మంగళవారం ఎంతంటే..

ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడగాలులు కూడా వీస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది. ఓ మోస్తరు ఎండ ఉన్నా.. ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. ఎండలు మండుతుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. మంగళవారం 14 వేల 117 మెగావాట్ల పవర్ డిమాండ్‌ నమోదైంది. సాయంత్రం వరకు విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 15 వేల మెగావాట్ల వరకే విద్యుత్ సరఫరా చేయగలమని అధికారులు చెప్పారు. సో.. ఏప్రిల్, మే నెలలో ఆ డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.

ఉదయం పది తర్వాత..

ఉదయం పది తర్వాత..

ఎండలతో ఉదయం పది తర్వాత కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఎండ వేడి తాళలేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఏప్రిల్‌, మే నెలలో ఎండలు మరింత పెరగనున్నాయి. 18 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యుత్‌ శాఖ అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 వేల 162 మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ డిమాండ్‌.. ఇప్పుడు మరింత పెరుగుతోంది. సౌత్‌ ఇండియాలో అత్యధిక విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా.. తమిళనాడు మొదటి రాష్ట్రంగా ఉంది.

 వడగాలులు

వడగాలులు

మధ్యాహ్నం వడ గాలులు దడ పుట్టిస్తున్నాయి. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో మార్చి ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డ్‌. 2016 మార్చి 18న భద్రాచలంలో 42.8, 2017 మార్చి 31న ఆదిలాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మార్చిలోనే వేడి 43 డిగ్రీలకు చేరడంతో ఇక ఏప్రిల్‌, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

4 రోజులు

4 రోజులు

మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండవేడి వల్ల నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణం కన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడ గాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+