టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు... పక్కనే పెట్రోల్ బంక్
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్జల్‌గంజ్‌లో గల ఓ టైర్ల గోదాములో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఎగసిపడుతోన్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
Recommended Video

జనం బెంబేలెత్తిపోవడంతో చాదర్ ఘాట్ - అఫ్జల్‌గంజ్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దట్టమైన పొగ అలుముకోవడంతో పక్కన గుడిసెలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మూసీకి పక్కనే ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఫైర్ ఇంజిన్లకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 15 ఫైర్ ఇంజిన్లు రాగా.. అతికష్టం మీద 8 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి.

అగ్నిప్రమాదంతో అఫ్జల్ గంజ్ జనం భయపడుతున్నారు. మంటలు త్వరగా ఆరాలని కోరుకుంటున్నారు. అసలే ఎండకాలం కావడం.. అగ్ని కీలలు ఎగసిపడంతో టెన్షన్ నెలకొంది.












Click it and Unblock the Notifications