Fire Accident: నాచారంలో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. నాచారం పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. కంపెనీ చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటన ఘటనా స్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారీ మంటలతో పొగ కమ్ముకురావడంతో మంటలు అర్పేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది.
అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. షాట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్ల ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. జేపీ ఇండస్ట్రీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అగ్ని ప్రమాదంతో ఉలిక్కి పడుతున్నారు. అయితే హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. ఈ మధ్యే సికింద్రాబాద్ స్వప్నలోక్ కంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఏడు, ఎనిమిది అంతస్థుల్లో ఈ మంటలు చెలరేగాయి. ఐదో ఫ్లోర్ లో ఉన్న ఐదుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివ అనే మరో వ్యక్తి మృతి చెందారు.

అంతకు ముందు కూడా ఓ స్పోర్ట్స్ షో రూమ్ లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంతో బిల్డింగ్ మొత్తం దెబ్బతినడంతో దాన్ని కూల్చేశారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుకాణ యజమానులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications