Hyderabad: వామ్మో బొద్దింకలు.. రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు..!
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పలు రెస్టారెంట్లు, హోటళ్ల తీరు మారడం లేదు. తాజా ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో దాడులు చేశారు. శుక్రవారం అత్తాపూర్ లోని కాలిఫోర్నియా బురిటో, మజ్లిస్ కల్చర్ పై దాడులు చేశారు. కాలిఫోర్నియా బురిటో అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు. వంట గది ప్రాంగణంలో బొద్దింకలు కనిపించాయి. ఫుడ్ హ్యాండ్లర్‌ల కోసం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, ఆహార తయారీలో ఉపయోగించే రివర్స్ ఆస్మాసిస్ (RO) నీటికి సంబంధించిన నీటి విశ్లేషణ నివేదిక రెండూ లేవని గుర్తించారు.
నిల్వ చేసిన పాడైపోయిన కాలీఫ్లవర్ కూడా బయటపడింది. ఇది ఆహార నిల్వ పై నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లోని ఆహార వస్తువులు సరిగ్గా కవర్ చేయలేదు. ఉష్ణోగ్రత రికార్డులను నిర్వహించడంలో సంస్థ విఫలమైందని అధికారులు తెలిపారు. కౌంటర్‌లో FSSAI లైసెన్స్ సరిగ్గా ప్రదర్శించలేదు. ఆహార నిర్వాహకులు హెయిర్‌క్యాప్‌లు, అప్రాన్‌లను ధరించలేదు. మజ్లిస్ కల్చర్ క్యూసిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను కనుగొన్నారు. వీటిలో ఫ్రూట్ సిరప్, కేవ్రా వాటర్, ఫ్రూట్ క్రష్ ఉన్నాయి.

ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు, రిఫ్రిజిరేటర్‌లో, కవర్లు లేదా లేబుల్‌లు లేకుండా కనిపించాయి. ఆహార వస్తువులు సరిగ్గా నిల్వ చేయలేదు. మాంసాహార చైనీస్ వంటలలో ఉపయోగించబడుతున్నట్లు అనుమానిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రత ఉంచకుడా పదార్థాలు నిల్వ చేస్తున్నారు. 10 రోజుల క్రితం హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలోని రెండు ప్రముఖ రెస్టారెంట్లలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Task force team has conducted inspections in Attapur on 01.11.2024.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) November 2, 2024
𝗧𝗵𝗲 𝗠𝗮𝗷𝗹𝗶𝘀 𝗖𝘂𝗹𝘁𝘂𝗿𝗲 𝗖𝘂𝗶𝘀𝗶𝗻𝗲, 𝗔𝘁𝘁𝗮𝗽𝘂𝗿
* Expired articles of food like Fruit Syrup, Kewar Water, Fruit Crush were found in store room & kitchen. Hence discarded on the spot.
*… pic.twitter.com/psl9RxpfEe
శిల్పి ఎలైట్ రెస్టారెంట్, బార్ అండ్ బహార్ బిర్యానీ కేఫ్‌లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ దాడులు చేశారు. జిడ్డుగల పైకప్పులు, ఓపెన్ డ్రెయిన్లు, నిలిచిపోయిన ముగురు నీరు ఉండడం గమనించారు. రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉందని పేర్కొన్నారు. కూరగాయల నిల్వ, రిఫ్రిజిరేటర్ ప్రాంతాలలో బొద్దింకలను కనిపించాయి. టమాటాలు, కాకరకాయ కుళ్లిన స్థితిలో ఉన్నట్లు తెలిసింది. సికింద్రాబాద్ నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చేశారు.కిచెన్ పరిసరాలు, ప్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నట్లు కనిపించింది. తుప్పుపట్టిన ప్రిడ్జ్ లో చికెన్, మటన్ స్టోర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications