GHMC elections 2020: 18 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. అన్ని పార్టీలు పోటాపోటీగా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. శుక్రవారంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ముగియనుండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి.
బుధవారం 21 మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మరో 18 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.

బీజేపీ రెండో జాబితా:
హయత్ నగర్ - కల్లెం నవజీవన్ రెడ్డి
మన్సూరాబాద్ - కొప్పుల నర్సింహారెడ్డి
బీఎన్ రెడ్డి నగర్: లచ్చి రెడ్డి
చంపాపేట: మధుసూదన్ రెడ్డి
లింగోజీగూడ: రమేశ్ గౌడ్
కొత్తపేట: పవన్ కుమార్
చైతన్యపురి: నర్సింహగుప్తా
సరూర్ నగర్: ఆకుల శ్రీవాణి
నగోల్: చింతల అరుణ యాదవ్
జంబాగ్ : రూప్ ధరక్
గుడి మల్కాపూర్: దేవర కరుణాకర్
గోల్కొండ: పాశం శకుంతల
దత్తాత్రేయ నగర్: ధర్మేంద్ర సింగ్
మంగళ్ హాట్: శశికళ
జియాగూడ: బోయిన దర్శన్
ఝాన్సీబజార్: రేణు సోని
మైలార్ దేవ్‌పల్లి: శ్రీనివాస్ రెడ్డి
జంగంమెట్: మహేందర్
బీజేపీ తొలి జాబితా:
పత్తర్ గట్టి - అనిల్ బజాజ్
మొఘల్ పురా - మంజుల
పురానాపూల్ - కొంగర సురేందర్ కుమార్
కార్వాన్ - కట్ల అశోక్
లంగర్ హౌజ్ - సుగంధ పుష్ప
టోలిచౌకి - రోజా
నానల్ నగర్ - కరణ్ కుమార్
సైదాబాద్ - అరుణ
అక్బర్ బాగ్ - నవీన్ రెడ్డి
డబీర్ పురా - మిర్జా అఖిల్ అఫండి
రెయిన్ బజార్ - ఈశ్వర్ యాదవ్
లలిత్ బాగ్ - చంద్రశేఖర్
కుర్మగూడ - ఉప్పాళ్ల శాంత
ఐఎస్ సదన్ - జంగం శ్వేత
రియాసత్ నగర్ - మహేందర్ రెడ్డి
చాంద్రాయణ గుట్ట - నవీన్ కుమార్
ఉప్పుగూడ - టి. శ్రీనివాసరావు
గౌలిపురా - ఆలె భాగ్యలక్ష్మి
షాలిబండ - నరేష్
దూద్ బౌలి - నిరంజన్ కుమార్
టికెట్ దక్కకపోవడంతో ఆత్మహత్యాయత్నం
Recommended Video
బీజేపీ కార్పొరేటర్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నేత విజయలతారెడ్డి.. ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు దక్కాల్సిన టికెట్ ఇతరులకు కేటాయించారని మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ తమకు టికెట్ రాకుండా చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications