కరోనాను జయించిన బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్, సంతోషంగా ఉందంటూ ట్వీట్..
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా వైరస్‌ను జయించారు. ఆయన ఇటీవల కరోనా వైరస్ వచ్చిన సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. చక్కగా వ్యాయామం చేస్తూ మీడియాకు కనిపించారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కరోనా నుంచి కోలుకున్నానని, తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైరస్ నుంచి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతల తెలిపారు. కరోనా పరీక్షలో టెస్టులో నెగిటివ్ వచ్చింది. ఆ పరీక్ష రిపోర్టును కూడా ట్వీట్ చేశారు. వాస్తవానికి ఆయనకు వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది. అతని కుటుంబసభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చింది. మూడోసారి రామ్మోహన్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

వైరస్ తగ్గిన తర్వాత ప్లాస్మా డొనేట్ చేస్తానని కూడా బొంతు రామ్మోహన్ ఇదివరకే తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా నగరంలో పర్యటిస్తూ ఓ టీ దుకాణంలో ఛాయ్ తాగారు. ఆ తర్వాత ఆ దుకాణదారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తొలిసారి ఆయన కరోనా పరీక్ష నిర్వహించారు. కుటుంబం మొత్తానికి పరీక్ష చేయించగా, అందరికీ నెగటివ్‌గా వచ్చింది.
తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మేయర్ పేషీలోని సిబ్బందికి కరోనా వచ్చింది. అప్పుడు కూడా వైద్యులు మేయర్‌కు కరోనా టెస్టులు చేయగా.. రెండోసారి కరోనా నెగిటివ్ అనే వచ్చింది. హైదరాబాద్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో చాలామందితో కలవాల్సి వస్తోంది. మళ్లీ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఇక అప్పటినుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇప్పుడు వైరస్ తగ్గడంతో హ్యాపీగా ట్వీట్ చేశారు.
With all for your wishes, I am happy to share with you all that I am tested nagetive for #COVID. Thank you each one of you who had wished for my speedy recovery🙏. #Blessed @trspartyonline @TelanganaCMO@KTRTRS pic.twitter.com/j1O5M8L4IT
— Dr BonthuRammohan,Mayor (@bonthurammohan) August 10, 2020
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications