గుడ్ న్యూస్: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా?

అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ మెట్రో ప్రజాదరణ పొందింది. ప్రతిరోజు 5 లక్షల మంది మెట్రోద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు. నగరంలో ఓ చివరి నుంచి మరో చివరకు తక్కువ సమయంలో వేగంగా చేరుకునేవారంతా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అటువంటి హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం దక్కింది. మెట్రో సాధించిన విజయాన్ని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు కేస్‌ స్టడీగా మార్చారు. ఆ సంస్థ ప్రచురించే సోషల్‌ ఇన్నోవేషన్‌ రివ్యూ (SSIR)లో తాజాగా ఈ విషయాన్ని పబ్లిష్ చేసింది.

భారతదేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవమని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ వ్యాఖ్యానించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమల్లో ఎదరవుతున్న సమస్యలు.. వాటి పరిష్కారానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు.. తదితర అంశాలపై ఈ జర్నల్ ను ప్రచురించింది. ప్రపంచంలో అనేక కీలక ప్రాజెక్టులుండటంతోపాటు వాటి మధ్య ఉన్న పోటీ దృష్ట్యా ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్ రామ్‌ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టును ఎంచుకున్నారు. దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేసిన స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం కేస్‌ స్టడీగా పబ్లిష్ చేసింది.

good news for hyderabad metro project

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూపొందించిన అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతమైందంటే దానికి కారణం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభ అని రీసెర్చ్‌లో పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులతో ప్రజలకు ఉపయోగమైన ప్రాజెక్టుల నిర్మాణం ఎలా సాధ్యపడుతుందనే అంశానికి ఇది నిదర్శనమని జర్నల్ లో వ్యాఖ్యానించారు. దీనిపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోను పాతబస్తీ మీదగా శంషాబాద్ విమానాశ్రయానికి విస్తరిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పనులు షురూ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+