తాత ఫ్రీడమ్ ఫైటర్.. కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది: మంత్రి కేటీఆర్
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ యాక్టివ్‌గా ఉంటారు. అవును నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు.. సమస్యలకు పరిష్కారాలు చెబుతుంటారు. ఇవాళ ఒక కొత్త ఫోటో పోస్ట్ చేశారు. అందులో ఉన్న వ్యక్తి గురించి వివరించారు. తన తాత.. ఫ్రీడం ఫైటర్ అని పేర్కొన్నారు. దానికి ఫ్యాన్స్ రీ ట్వీట్స్ చేస్తున్నారు. కేటీఆర్ తాత గొప్పతనం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
కేటీఆర్ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని అందరికీ పరిచయం చేశారు. ఫొటోలో ఉన్నది తన తాతయ్య జె కేశవరావు అని వెల్లడించారు. వాటిలో ఒకదానిలో చిన్నప్పటి కేటీఆర్ కూడా కనిపిస్తున్నారు. తమ కుటుంబంలో ఆయన స్ఫూర్తిదాయక వ్యక్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని కేటీఆర్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపును ఇచ్చిందని వివరించారు. తన తాత గొప్పతనం గురించి రాశారు. నెటిజన్లు కూడా అదేవిధంగా స్పందించారు. మునుపటి తరం కూడా.. జాతి కోసం పోరాడిందని పేర్కొన్నారు. అలా వారసత్వం వచ్చిందని తెలిపారు.












Click it and Unblock the Notifications