'గల్లా' కోసం రంగంలోకి మహేష్ బాబు?
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ప్రస్తుతం మరో సూపర్ స్టార్ గా మారారు. వీరి కుటుంబం నుంచి చాలామంది హీరోలుగా పరిచయమయ్యారు. గుంటూరు ఎంపీ, మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్ పెద్దకొడుకు అశోక్ హీరో సినిమాతో రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అతను చేయబోయే రెండో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
అశోక్ కు మహేష్ బాబు మొదటి నుంచి మద్దతునిస్తూ వచ్చాడు. ప్రిన్స్ అభిమానులు కూడా అశోక్ కు మద్దతు పలికారు. త్వరలోనే ఆయన మరో అల్లుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గల్లా జయదేవ్ పద్మావతి రెండో కుమారుడు సిద్ధార్థ కూడా ఎంటరవబోతున్నారు. అభిమానులు మాత్రం ప్రిన్స్ ను ఎంతో గొప్పగా పొగుడుతుంటారు. ఎంతోమంది పేదలను ఆదుకున్నాడని, ఎందరో చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించాడని, అలాగే తన కుటుంబానికి చెందినవారు కూడా తెలుగు పరిశ్రమలో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తుంటారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

సిద్ధార్థ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తన పెద్ద అల్లుడికి మద్దతు ఇచ్చిన విధంగానే చిన్న అల్లుడికి కూడా మహేష్ మద్దతు ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు సినీ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications