హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ఇదేం బాదుడు.. అరగంటకు రూ.500లా..?

|
Google Oneindia TeluguNews

పార్కింగ్ కష్టాలు మాములుగా లేవు. పార్కింగ్ పెట్టే వాహనం నిలిపేందుకు ప్లేస్ కాదు.. మన వాహనం నిలిపితే ఆయా ఏజెంట్లు బాదే ఫైన్. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు గంటకు 10 రూపాయలు ఉంటుంది. అంతకు మించి అంటే 20 లేదా 50 రూపాయల వరకు ఉండొచ్చు. ఒకరు తన కారును రైల్వే స్టేషన్‌లో అర గంటల పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. దీంతో రైల్వే స్టేషన్లు కూడా ప్రైవేటీకరణ చేశారా అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టికెట్ ట్వీట్..

టికెట్ ట్వీట్..

పార్కింగ్ ఫీజ్‌కు సంబంధించిన టికెట్‌ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. కేంద్ర రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ.. ఈ సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగింది హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ ఏకే జైర‌థ్‌ ఈ నెల 4వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వెళ్లారు. అక్కడున్న పార్కింగ్‌ ప్లేస్‌లో త‌న వాహ‌నాన్ని పార్క్ చేశారు. త‌న పని పూర్తయిన అనంత‌రం తిగిరి పార్కింగ్‌కు చేరుకున్నాడు. త‌న‌కు ఇచ్చిన పార్కింగ్ ఫీజును చూసి ఆర్మీ ఆఫీస‌ర్ షాక్ అయ్యాడు.

అలా ఎలా

అలా ఎలా

కేవ‌లం 31 నిమిషాల‌కు 500 ఛార్జ్ వేయడంతో ఇంత ఎందుకంటూ ప్రశ్నించారు. పార్కింగ్ నిర్వాహ‌కులు ఆయ‌న మాట‌లు ఏ మాత్రం వినిపించుకోకుండా 500 వ‌సూలు చేశారు. పార్కింగ్ ఫీజు 423 రూపాయల 73 పైస‌లు. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కింద 38రూపాయల 14 పైసలు చొప్పున వ‌సూలు చేశారు. పార్కింగ్ నిర్వాహ‌కుల‌తో వాదించిన‌ప్పటికీ లాభం లేకుండా పోయింది.

Recommended Video

Kerala Driver Car Parking Video | Man Behind This Sensation || Oneindia Telugu
తప్పక చెల్లింపు

తప్పక చెల్లింపు

చేసేదేమీ లేక బాధితుడు త‌నకు జ‌రిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవ‌లం 31 నిమిషాల‌కు పార్కింగ్ ఫీజు 500 వ‌సూలు చేయ‌డాన్ని కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. ఇది దారుణ‌ం అని కామెంట్ చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వేశాఖ/ కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

English summary
half an hour parking fee of rs 500. charged at secunderabad railway station private agents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X