Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. గాంధీలో ఐవిఎఫ్ సెంటర్..!
ఈ మధ్య సంతానలేమి సమస్యలు పెరిగి పోతున్నాయి. చాలా జంటలు సంతానం కోసం ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఐయూఐ చేయించుకుంటున్నారు. ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు. అయితే దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా మంది అప్పులు చేసి మరి చికిత్స చేయించుకుంటున్నారు. డబ్బులు లేని వారు దేవుడిపై భారం వేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. సంతాన లేమికి ప్రభుత్వం ఆస్పత్రుల్లో సరైన చికిత్సలు అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఐవిఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల్లో ఐవిఎఫ్ సెంటర్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మంగళవారం ప్రకటించారు. గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన
నర్సింగ్ సిబ్బంది, విధుల్లో ఉన్న వైద్యులు, డయాగ్నోస్టిక్, క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎలా ఉందని వాకాబు చేశారు. రోగులు నేలపై కూర్చొని ఉండడాన్ని గమనించిన ఆయన సరైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వసతి గృహానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నామని, ఇప్పటికే రూ.78 కోట్లు నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. కింగ్ కోటి ఆసుపత్రిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మందిరాన్ని మంత్రి పరిశీలించారు.
గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులందరూ నాకు అక్కాచెల్లెళ్లలాంటి వారేనని మంత్రి అన్నారు. దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలకు చెందిన పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారని వారికి సరైన చికిత్స అందించాలన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications