సిటీలో పలు చోట్ల వాన.. జిల్లాలో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో కూడా వాన పడుతుంది. దీంతో పల్లెల్లో అన్నదాతలు ఇప్పటికీ పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. చిన్న వానకే సిటీలో గల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. ఈ సారి కూడా అలాంటి పరిస్థితి ఉంది.

మెహదీపట్నం, బంజారాహిల్స్‌, గుడిమల్కాపూర్‌, లంగర్‌ హౌస్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, బాగ్‌ అంబర్‌పేట, కూచికూడలో వర్షం పడింది. అబిడ్స్‌, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్‌, ఖైరతాబాద్‌, నారాయణగూడ, అఫ్జల్‌గంజ్‌, గోషామహల్‌, మంగల్‌హాట్‌, సికింద్రాబాద్‌, పద్మారావ్‌నగర్‌, చిలుకలగూడ, సీతాఫల్‌మండి, వారాసిగూడ, బౌద్ధనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.

heavy rain fall in hyderabad and some districts

వచ్చే మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వానలతో తెలంగాణలో వాతావరణం మారిపోయింది. దాదాపు చల్లగానే ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే ఎండ ప్రభావం ఉంటుంది. మిగతా సమయంలో దాదాపుగా వాతావరణం చల్లగానే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+