హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం: వడగళ్ల బీభత్సం
హైదరాబాద్: నగరంలో శనివారం సాయంత్రం నుంచి బారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్: నగరంలో శనివారం సాయంత్రం నుంచి బారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. వడగళ్లు కూడా పడ్డాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి.
శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చార్మినార్, బహదూర్ పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండిమైసమ్మ, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వడగళ్లవాన కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Massive Hail Rain In Hyderabad ☁️ pic.twitter.com/Ew5eF0il1z
— Swapnil Kommawar (@KommawarSwapnil) March 18, 2023
శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ లో భారీ వర్షం కురిసింది. ప్యాట్నీసెంటర్, బేగంపేట,మారేడుపల్లి, ఓయూ క్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. శనివారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
కరీంనగర్, కామారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు కూడా వీచాయి. కాగా, మరో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications