హైదరాబాద్‌లో కుండపోత వర్షం: రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి ఆశామంతా మేఘావృతమై ఉండగా.. ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, మియాపూర్ చందానగర్, మాదాపూర్ గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బోరబండ, మధురానగర్, పంజాగుట్ట, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపుల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, చైతన్యపూరి, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. మరోసారి భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టారు.
#WATCH | Rain lashes parts of #Hyderabad City
— Hindustan Times (@htTweets) September 8, 2024
(📹ANI) pic.twitter.com/v6gqrr2lzC
తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
#WATCH | Telangana: Rain lashes parts of Hyderabad City. pic.twitter.com/ceWHngq7y5
— Naren (@kotaknaren) September 8, 2024
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్ధపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications