Weather Update: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కొండాపూర్, కాకతీయ సోసైటీ, బోరబండ, మోతినగర్, అమీర్ పేట, ఎస్సార్ నగర్ లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఐఎండీ అంచనా వేసింది. ఈ మేకతు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో మాత్రం తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో వానలు కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సగటు వర్షపాతం 489.6 మి.మీ.కు గాను 556.7 మి.మీ వర్షపాతం నమోదు అయింది.
హైదరాబాద్‌లో కూడా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 388.6 మిల్లీమీటర్లకు వ్యతిరేకంగా 412.6 మిమీ నమోదైంది.












Click it and Unblock the Notifications