చల్లబడిన హైదరాబాద్: పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాలో కూడా
హైదరాబాద్: నగరంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఎండవేడిమి నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. అయితే, వాహనదారులు మాత్రం రోడ్లపైకి వరదనీరు ఇబ్బందులు పడ్డారు.
కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బేగంపేట, అల్వాల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తార్నాక, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
@VizagWeather247
— PVM💙 (@PVM1501) April 5, 2023
Rain started in #Hyderabad
With heavy thunderstorms and lightning ⛈️
Situation in Madhapur pic.twitter.com/1YrsGdTgiI
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతోనే బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మెదక్, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్, కామారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిశాయి. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేగాక, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications