Hyderabad Rain: హైదరాబాద్ లో కుంభ వృష్టి.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్..!

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, నిజాంపేట, జేఎన్టీయూ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ముసాపేట, ఎర్రగడ్డ, ఎస్సాఆర్ నగర్, బొరబండ, మోతినగర్, మదాపూర్, జూబ్లీహిల్స్ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, బంజారహిల్స్, పంజాగుట్ట, కోటి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ లో కూడా తేలిపాటి వానలు పడ్డాయి.

జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాల్లోనూ భారీ వర్షం కొడుతోంది. కొన్ని చోట్ల రాళ్లు(వడగళ్లు) పడుతున్నాయి. కుత్బుల్లార్, మల్కాజిగిరి, ఆల్వాల్ ఏరియాల్లోనూ ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. సిటీలో క్యూముల నింబస్ మేఘాలు ఏర్పడ్డాయని.. వీటితో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ జీహెచ్ఎంసీ, డిజస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందిని అలర్ట్ చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Heavy rain lashes many parts of Hyderabad

అవసరమైతే తప్ప బయటికి రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పాడే అవకాశం ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని.. పలు చోట్ల నీరు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా వాన పడింది. కరీంగనర్ లో చిరు జల్లులు పడ్డాయి.

సిద్దిపేట కూడా జల్లులు పడ్డాయి.మరో మూడు రోజులు పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+