Hyderabad Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. భాగ్యనగరంలో మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. తార్నాక, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హబ్సిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, అమీర్ పేట, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్, జూబ్లీహిల్స్, మోతినగర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీ, బేగంపేట లో వాన పడింది. భారీ వర్షంతో పలు చోట్ల నీరు రోడ్డు పైకి చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.
వానతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది నీరు నిల్వ ఉన్న చోట నీటి తోడేస్తున్నారు. చెట్లు కూలిన చోట వాటిని క్లియర్ చేస్తున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ కోరుతోంది. మరోనాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణశాఖ తెలిపింది.

మరో గంటలో నగరంలో భారీవర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎసీ అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని వివరించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో ఈసారి నైరుతి రుతు పవనాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. జులైలోనైనా రుతుపవనాలతో వర్షాలు కురిస్తాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications