Hyderabad: హెచ్ఎండీఏ సువర్ణ అవకాశం.. తక్కువ ధరల్లో 1 BHK, 2 BHK ప్లాట్లు..!
బండ్లగూడ, పోచారంలో 1 BHK, 2 BHK ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయించనుంది.
మీరు హైదరాబాద్‌లో తక్కువ ధరలో 1 BHK లేదా 2 BHK అపార్ట్ మెంట్ కొనాలని చూస్తున్నారా.. అయితే మీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అందుకు అవకాశం కల్పిస్తోంది. బండ్లగూడ, పోచారంలో అందుబాటులో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో మొత్తం 904 ఫ్లాట్లు అమ్మనుంది.
హైదరాబాద్‌లోని బండ్లగూడలో 233 1BHK ఫ్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉండగా, పోచారంలో 254 1BHK, 417 2BHK ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో సగటున 545 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 BHK ఫ్లాట్ ధర రూ. 15 లక్షలుగా నిర్ణయించగా.. అదే ప్రాంతంలో 653 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 BHK సీనియర్ సిటిజన్ ఫ్లాట్‌ల ధర రూ.18 లక్షలుగా ఉంది.

పోచారంలో 760 చదరపు అడుగుల 1 BHK రూ. 19 లక్షలు ఉండగా.. 520 చదరపు అడుగుల 1 BHK రూ. 13 లక్షలుగా నిర్ణయించారు. అపార్ట్ మెంట్ కొనుగోలు చేయాలనుకుంటే 1 బిహెచ్‌కె ఫ్లాట్‌కు 1 లక్ష, 2 బిహెచ్‌కె ఫ్లాట్‌లకు రూ.2 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని హెచ్‌ఎండీఏకు డీడీ రూపంలో చెల్లించాలి. మార్చి 25, 2023లోపు చెల్లించాలి. అలాట్‌మెంట్ జరిగిన 60 రోజులలోపు 80 శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 90 రోజులలోపు చెల్లించవచ్చు.
పూర్తి వివరాల కోసం పోచారంలోని ఫ్లాట్‌ల కోసం ఏఈ జి. రవీందర్‌రెడ్డి సెల్‌ఫోన్ 9133366750, హైదరాబాద్‌లోని బండ్లగూడలోని ఫ్లాట్‌ల కోసం ఏఈ అనిల్‌కుమార్‌రెడ్డి 91333366746ని సంప్రదించాలి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications