కొంపముంచిన యువతి స్నేహం: ఇన్‌స్టాగ్రాం ఫెండ్ అని ఇంటికి పిలిస్తే.. బంగారమంతా ఊడ్చేశాడు
హైదరాబాద్: సోషల్ మీడియా ఇప్పుడు చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఉపయోగిస్తున్న ఫ్లాట్‌ఫామ్. స్వయంగా తెలిసిన స్నేహితులకంటే కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మందితో కనెక్ట్ అవుతున్నారు జనాలు. అయితే, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి గురించి ఎలాంటి విషయాలు తెలియకున్నా వారికి దగ్గరవడం అనేక నేరాలు, మోసాలకు కారణమవుతున్నాయి. అయినా, యువత మాత్రం అప్రమత్తంగా ఉండటం లేదు.

ఇన్‌స్టాగ్రాంలో ఇంటర్ విద్యార్థిని ఫ్రెండ్ రిక్వెస్ట్
తాజాగా, హైదరాబాద్ నగరంలోనూ సోషల్ మీడియా దిగ్జజం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన స్నేహితుడి చేతిలో మోసపోయింది ఓ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనల్ తండాలోని చింతలగుట్టకు చెందిన బానోతు సురేష్ అలియాస్ సన్నీ(22) జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్‌లో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో అందమైన ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఈ క్రమంలో మూసాపేట శ్రీహరినగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. దీంతో పలుమార్లు వీరిద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది.

ఉన్న బంగారమంతా ఊడ్చేసిన ఇన్‌స్టాగ్రాం ఫ్రెండ్
ఈ క్రమంలో ఏప్రిల్ నెల 20న తల్లిదండ్రులు ఏదో పనిమీద ఊరేళ్లడంతో ఆ యువతి.. ఫోన్ చేసి సన్నీని ఇంటికి ఆహ్వానించింది. అతడ్ని ఇంట్లోనే కూర్చోబెట్టి కూల్ డ్రింక్ తీసుకొస్తానని బయటకి వెళ్లింది. అదే అదనుగా బీరువాలోని బంగారు ఆభరణాలను తన జేబులో వేసుకున్నాడు సన్నీ. ఆ తర్వాత ఆమెతో కొద్ది సేపు మాట్లాడి వెళ్లిపోయాడు. అనంతరం ఏప్రిల్ 24వ తేదీన మరోసారి ఆమె ఇంటికి వచ్చిన సన్నీ.. 20 తులాల నగలు, రూ. 10వేలతో ఉడాయించాడు.

లబోదిబోమంటూ పోలీసుల వద్దకు తల్లిదండ్రులు.. గుట్టువిప్పిన కూతురు
ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు మే 1న కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంట్లోవారిని విచారించగా.. సురేష్ అలియాస్ సన్నీ ఇంటికి వచ్చి వెళ్లినట్లు ఇంటర్ విద్యార్థిని తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. బుధవారం నిందితుడు సన్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎలాంటి పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేసి మోసవపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
-
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications