Hyderabad: జేఎన్టీయూ వైపు వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. !

హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభించిన లులు మాల్ కారణంగా కూకట్ పల్లి, జేఎన్టీయూ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మాల్‌ లో వస్తువులు కొనడానికి భారీగా జనం తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా సాయంత్రం ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మాల్‌కు వెళ్లే వాహనాలతో కూకట్‌పల్లి, బాలానగర్‌, వై జంక్షన్‌ వీధుల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

2 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటకు పైగా సమయం పటింది. ఆదివారం నాటి ట్రాఫిక్ గురించి చాలా మంది ఎక్స్ లో ట్వీట్ చేశాడు. తాము కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్లేందుకు గంటకుపైగా సమయం తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ, 'లులు మాల్ ఓపెనింగ్ కారణంగా ఎన్ హెచ్ 65 సూపర్ హై ట్రాఫిక్‌ జామ్ అవుతుందని ట్వీట్ చేశారు. లులు మాల్ కారణంగా గత 2 రోజులుగా కేపీహెచ్ బీ కాలనీలో భారీ ట్రాఫిక్ ఉంటోందని పేర్కొంటున్నారు.

 Hyderabad JNTU No Lulu Mall caused heavy traffic jam

లులూ మాల్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ సైతం విపరీతమైన రద్దీ కనిపించింది. ఓవర్‌లోడ్ కారణంగా ఎస్కలేటర్లు మధ్యలోనే ఆగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. లులు మాల్‌లో తొక్కిసలాట వంటి దృశ్యాలున్నాయని మరో సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశాడు. సోమవారం కూడా సెలవు కావడంతో భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

హైదరాబాద్‌లోని లులు మాల్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఎ సమక్షంలో కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. ఈ మాల్ లో అనేక రకాల వస్తులు లభ్యమవుతాయి. 75 దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టోర్‌లతో పాటు, మాల్‌లో 14వందల మంది సీటింగ్ కెపాసిటీతో ఐదు స్క్రీన్‌ల సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి మరెన్నోసదుపాయలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+