హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికం: కోకాపేట నియో పోలిస్ భూముల వేలం, ఎకరం రూ. 100 కోట్లు
హైదరాబాద్: నగరంలో కోకాపేట భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) కోకాపేట-నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ కొనసాగుతోంది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు దాటడం విశేషం. సరికొత్త రికార్డులతో భూములు అమ్ముడుపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాగా, నియో పోలిస్ హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధర నిర్ణయించింది. ఈ-వేలంలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడటంతో ధరలు అమాంతం పెరిగాయి. అత్యధికంగా ఎకరం ధర రూ. 100.75 కోట్లు ఉండగా.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. గురువారం నిర్వహించిన రెండో దశ ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి.

నియో పోలిస్ ఫేజ్-2లోని 6,7,8,9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గురువారం ఉదయం వరకు 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబర్ ప్లాట్ల(18.47 ఎకరాల)కు వేలం నిర్వహించారు.
పదో నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ. 100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాటు ఉంది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థల పోటీ చూస్తుంటే ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్సీసీ, మైహోం, రాజ్‌పుష్పా తదితర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కోకాపేట భూముల వేలంలో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, కోకాపేట నియోపోలిస్ పేరుతో హెచ్ఎండీఏ 500 ఎకరాల్లో లేఅవుట్ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో రూ. 450 కోట్లతో రహదారులతోపాటు తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం తదితర అన్ని రకాల సదుపాయాలు కల్పించింది.
ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా భారీగానే ధర పలికింది. 2021లో ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా.. కనిష్టంగా ఎకరాకు రూ. 31 కోట్లు.. గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది. ఇప్పుడు ఫేజ్2లో 45.33 ఎకరాలకు ఈ వేలం నిర్వహించింది. కాగా, ఈ వేలం ద్వారా మొత్తం దాదాపు రూ. 2500 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ వేలం ముగిసేప్పటికి.. వారి అంచనాలు మించుతూ రూ. 3319 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications