ORR అలర్ట్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంపు

హైదరాబాద్: నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇకపై వేగం మరింత పెరగనుంది. ఔటర్‌పై స్పీడ్ లిమిట్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై అత్యధికంగా గంటకు 100 కిలోమీటర్ల వేగం అమలులో ఉంది. అయితే, ఈ వేగాన్ని ఇప్పుడు ప్రభుత్వం పెంచేలా చర్యలు తీసుకుంది.

గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ను తాజాగా అధికారులు జారీ చేశారు. ఇటీవల ఓఆర్ఆర్ అధికారులు, పోలీసులతో మంత్రి కేటీఆర్ ఓ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత సోమవారం ఇందుకు సంబంధించి అధికారికంగా సైబరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad ORR speed limit increased to 120 kmph from 100kmph, other lines also changed

1,2 లైన్లలోనే స్పీడ్ లిమిట్ గంటకు 120 కిలోమీటర్లకు పెంచారు. ఇక హెవీ వెహికల్స్ వెళ్లే లెన్ నంబర్ 3, 4లో 80 స్పీడ్ లిమిట్ ఉండనుంది. ఓఆర్‎ఆర్‎పై మాక్సిమం స్పీడ్ లిమిట్ గంటకు 80 కిలోమీటర్లు కాగా మినిమమ్ స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ పై తాజా నిబంధనలు అతిక్రమిస్తూ డ్రైవ్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ మేరకు ఓఆర్ఆర్ పై ఎక్కడిక్కడ స్పీడ్ లేజర్ గన్స్ అమర్చినట్టు తెలిపారు. ఓఆర్ఆర్‌పై పిక్ అప్ డ్రాప్ చేసిన వాహనాలు నిలిపి ఉంచిన మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 40 కిలో మీటర్ల కంటే తక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనాలకు ఓఆర్ఆర్‌పై అనుమతి లేదు. ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి లేదు.

అయితే, అతివేగం కారణంగా ఓఆర్‌ఆర్‌లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ప్రమాదాల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు గతంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓర్‌ఆర్‌ఆర్‌పై వేగ పరిమితిని 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

ఆ తర్వాత ఓఆర్ఆర్‌ఆర్ ప్రయాణికులు భద్రతపై చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పీడ్ లిమిట్‌ను పెంచాలని భావించారు. ప్రస్తుతం దాదాపు 154 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్‌ఆర్‌పై లైటింగ్ సిస్టంతో పాటు రోడ్ సేఫ్టీ మేజర్స్ పాటిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ స్పీడ్ లిమిట్‎ను తిరిగి 120 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+