Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డేటింగ్ యాప్‌లో కవ్వింపులతో ట్రాప్... నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్... పోలీసులకు యువకుడి ఫిర్యాదు..

నగ్న వీడియో కాల్స్‌తో యువకులను ట్రాప్ చేసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలానే వెలుగుచూశాయి. తాజాగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా యువకుడిని ట్రాప్ చేసి అతని నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... కొంతమంది ముఠా ఓ ఆన్‌లైన్‌ డేటింగ్ యాప్‌లో ఐడీని క్రియేట్ చేశారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్ర గోదావరి హోమ్స్‌లో నివసించే రాజు(పేరు మార్చాం) అనే యువకుడు ఆ డేటింగ్ యాప్‌లో మెంబర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు ఐడీ నుంచి రాజుకు మెసేజ్‌లు రావడం మొదలైంది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఫోన్ కాల్స్,ఆపై వీడియో కాల్స్ వచ్చాయి. అవతలి వైపు అమ్మాయి అతన్ని రెచ్చగొట్టడంతో... అతను ట్రాప్‌లో పడ్డాడు.

ఇదే క్రమంలో ఆమెతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. అంతే... అప్పటినుంచి అతనికి టార్చర్ మొదలైంది. సీన్‌లోకి మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. రాజుకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వని పక్షంలో నగ్న వీడియోను లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో భయపడిపోయిన రాజుకు మొదట ఏం చేయాలో తెలియలేదు. ఆ తర్వాత ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad trap with video calls in the name of dating police registered a case against cyber gang

ఇటీవల నిజామాబాద్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ఓ యువకుడు ఓ సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 'నేను ఒంటరి మహిళను.. మీతో చాట్ చేయాలనుకుంటున్నాను...' అని సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ చూసి అతను ట్రాప్‌లో పడ్డాడు. అప్పటినుంచి ఆమెకు మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. అవతలి వైపు యువతి అతన్ని వాట్సాప్ వీడియో కాల్స్‌తో కవ్వించింది. కొద్దిరోజులకు నగ్న వీడియో కాల్స్ చేసింది. అతను కూడా ఆమె ట్రాప్‌లో పడి అలాగే చేశాడు. ఆపై అతని నగ్న వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బు కావాలని ఆ ముఠా డిమాండ్ చేశారు. లేదంటే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు.

అప్పటికే రూ.24వేలు ఆ ముఠాకు సమర్పించుకున్న యువకుడు... అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే తరహా ఘటన ఇటీవలే బెంగళూరులోనూ చోటు చేసుకుంది. నగ్న వీడియోలు లీక్ చేస్తామని బెదిరించడంతో ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+