మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మహిళా ప్రయాణికులు మరో శుభవార్త చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ఆర్టసీ ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది.
లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది.

హైదరాబాద్ ప్రయాణికులకు గమనిక
కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో వెళ్లే 3వ నెంబర్ రూట్ సిటీ బస్సులను మౌలాలి కమాన్ మీదుగా టీఎస్ఆర్టీసీ పునరిద్దరించింది. గత పదేళ్లుగా మౌలాలి కమాన్ రూట్ బంద్ ఉంది. ప్రత్యామ్నాయంగా మౌలాలి హౌజింగ్ బోర్డ్ కాలనీ గుండా బస్సులను సంస్థ నడిపింది. తాజాగా ఆ రూట్ లో రాకపోకలు సాగుతుండటంతో మౌలాలి కమాన్ మీదుగా గతంలో మాదిరిగా బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.
ఈ 3 నెంబర్ రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్ వెళ్తుంది. ఆ రూట్ లో ప్రతి 20 నిమిషాలకో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలోని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
గమ్యం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా
మీరు టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారా!? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే https://rb.gy/inje4 లింక్ పై క్లిక్ చేసి మీ స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు వెళ్లే బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకోండి.












Click it and Unblock the Notifications