Hydra: కూకట్ పల్లి నల్ల చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేత..
హైడ్రా మళ్లీ అక్రమ కట్టడాలను కూల్చడం మొదలు పెట్టింది. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అక్రమ నిర్మాణల కూల్చివేసేందుకు సిద్ధమైంది. ఆదివారం ఉదయం నల్లచెరువు వద్దకు చేరుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. నల్లచెరువు పక్కన ఉన్న 16 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నట్లు హైడ్రా అధికారులు తేల్చారు. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు తెలువారుజామునే చేరుకున్నారు.
ఆక్రమణ దారులు కూల్చివేతలను అడ్డుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ నల్ల చెరువులో 16 కట్టడాలను అక్రమమని తేల్చారు. వీటికి రెండు రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. 16 మంది నోటీసులు ఇవ్వగా.. ఆదివారం కూల్చివేతలు ప్రారంభించారు. ఇది ఇలా ఉంటే.. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమణలను తొలగించే పని ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. మూసీ సుందరికరణలో భాగంగా మూసీ పక్కన అక్రమణలను తొలగించనున్నారు.

అయితే బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వనుంది. శనివారం బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిల్లిగుడిసెలులో నిర్మించిన రెండు పడకల ఇళ్లను పరిశీలించారు. మూసీ పరివాహక ఇళ్లు కోల్పోయిన వారికి ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో 12 వేల ఆక్రమణలు ఉన్నట్లు తేల్చారు. వీటిని హైడ్రా త్వరలోనే కూల్చివేసే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మూసీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 55 కిలో మీటర్ల మేర మూసీని సుందరికరించనుంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించనుంది.












Click it and Unblock the Notifications