CHAY ON SAM:చెప్పాల్సిందేమీ లేదు, అప్పుడే చెప్పాం కదా, సామ్ ఇష్యూపై చైతన్య

సినీ సెలబ్రిటీస్ అంటే అంతే.. విడిపోయినా వార్తల్లో ఉంటారు. అవును మనం చెప్పుకుంటుంది నాగ చైతన్య, సమంత గురించే.. విడిపోయిన తర్వాత సమంత చాలా సందర్భాల్లో తన అక్కసు వెళ్లగక్కింది. కానీ చైతన్య మాత్రం కామ్‌గా ఉండిపోయారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఆ సమయంలో కరణ్ జోహర్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమంత అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చారు. భర్త అంటే.. మాజీ భర్త అంటూ కామెంట్స్ చేసింది. ఇద్దరూ ఓకే రూములో ఉంటే పదునైన ఆయుధాలు ఉండాలని సమంత అన్న సంగతి తెలిసిందే. ఇక సమంత గెలకడంతో.. ఇప్పుడ చై వంతు వచ్చింది. స్పందించక తప్పని సిచుయేషన్ ఏర్పడింది. ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడారు.

 ప్రొఫెషనల్ లైఫ్

ప్రొఫెషనల్ లైఫ్

వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోందని నాగ చైతన్య తెలిపారు. తాను నటుడినని, తన నటనా జీవితం గురించే అందరూ మాట్లాడుకోవాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం గురించి చర్చించుకోవడాన్ని ఏమాత్రం ఇష్టపడనని తెలిపారు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని నొక్కి వక్కానించారు. సినీ జీవితం కంటే వ్యక్తిగత జీవితమే పెద్ద హెడ్ లైన్ గా మారిపోతోందని బాధ పడ్డారు. సినీ రంగంలో తాను సాధించిన వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. దురదృష్టం ఏమిటంటే సినిమా రంగంలో వ్యక్తిగత జీవితం కూడా వార్త అవుతుందని వివరించారు.

కారణాలు చెప్పాం కదా..?

కారణాలు చెప్పాం కదా..?


వైవాహిక జీవితం ముగించడానికి గల కారణాలు ఏమని చెప్పాలనుకున్నామో వాటిని ఓ ప్రకటన రూపంలో సంయుక్తంగా చెప్పేశామని నాగచైతన్య స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు సమంత దారి ఆమెదే. తన దారి తనదే అని చెప్పారు. ఇంతకుమించి ఈ విషయంలో చెప్పాల్సిందేమీ లేదు అని స్పష్టం చేశారు. దయచేసి తనను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

బిడియంగానే

బిడియంగానే


సామ్.. ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ చై అలా కాదు.. మొహమాట పడుతూనే చెప్పారు. తమ జీవితం ముగిసిన అధ్యాయం అని చెప్పేశారు. ప్రతీసారి దానిని వార్త చేయొద్దని కోరారు. ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ తమను ఇలా బయటకు లాగడం మంచి పద్దతి కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+