Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Zomato: జొమాటోలో చికెన్ మంచురియా ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందంటే..!

ఆన్ ఫుడ్ డెలివరీ యాప్ ల వల్ల అప్పుడప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా జొమాటో(Zomato) వల్ల చాలా మంది ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన విద్యార్థిని అనన్య జొమాటో యాప్ ద్వారా చికెన్ మంచురియా ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు చికెన్ మంచూరియాకు బదులుగా చికెన్ 65 వచ్చింది. దీంతో ఆమె దీనిపై కస్టమర్ కేర్ రిపోర్ట్ చేసింది. దీనికి జొమాటో కూడా రిప్లే ఇచ్చింది. ఇప్పడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనన్యతో సైదా అనే కస్టమర్ సర్వీస్ ప్రతినిధి చాట్ చేసింది. "నేను చికెన్ మంచూరియా ఆర్డర్ చేశాను, చికెన్ 65 కాదు," అని అని మెసేజ్ పెట్టింది. దానికి సైదా "దయచేసి దీన్ని కలిగి ఉండమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము... మీరు దీన్ని ఇష్టపడతారని మేము భావిస్తున్నాము" అని సమాధానం ఇచ్చింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసిన అనన్య ఎక్స్ లో పోస్ట్ చేసంది. "సగటు జొమాటో అనుభవం" అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అనన్య పోస్ట్ చాలా మంది నెటిజన్స్ స్పందించారు. జొమాటో కస్టమర్ కేర్ జోక్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

If you order Chicken Mancharia on Zomato app you will get Chicken 65

అనన్య పోస్ట్‌కి ప్రతిస్పందిస్తూ "హాయ్ అనన్య, మీరు ఎదుర్కొన్న ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి. ఇది మేము మీ కోసం ఎప్పుడూ కోరుకునే అనుభవం కాదు. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్/ఆర్డర్ IDతో మాకు DMని షూట్ చేయండి. మీ సమస్యను పరిష్కరిస్తాం" జొమాటో ఎక్స్ లో పోస్ట్ చేసింది. జొమాటో ఈ మధ్య ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మాదాపూర్ లో ఓ కంపెనీలో పని చేసే వ్యక్తి జొమాటో లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అతనికి ఫుడ్ పార్శిల్ వచ్చింది. అతను ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్ లో పెట్టుకోగా.. అది ఎగ్ బిర్యాని గుర్తించాడు.

చేసేది ఏమి లేక తినేశాడు. ఆ తర్వాత జొమాటో కస్టమర్ కేర్ ను సంప్రదించగా.. ఎగ్ బిర్యానీ వీడియో కావాలని అడిగింది. తన వద్ద ఫొటోలు మాత్రమే ఉన్నాయన చెప్పాడు. వారు వీడియో కావాలని అడగడంతో అప్పటికే ఎగ్ బిర్యానీ తినేయడంతో.. లైట్ తీసుకున్నట్లు చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+