Hyderabad: హైదరాబాద్ కు డెంజర్ బెల్స్.. ఇక కష్టాలు తప్పవా..!
బెంగళూరు నీటి సమస్యతో అల్లాడుతోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో బెంగళూరులో కాంక్రీట్ నిర్మాణాలు పదిరెట్లు పెరగడం వల్ల నీటి మట్టాలు 79 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. పట్టణ విస్తరణ పెరగడానికి, నీటి మట్టాల క్షీణతకు మధ్య బలమైన సంబంధాన్ని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. బెంగళూరు పట్టణ విస్తరణ 1973లో 8 శాతం నుంచి 2023లో 93.3 శాతానికి 1055 శాతం పెరిగింది.
అయితే ఈ మేరకు నీటి వనరులు మాత్రం పెరిగలేదు. హైదరాబాద్‌లో నీటి కొరత సమస్యలపై ఆందోళనలు చెలరేగుతోన్నాయి. ఎందుకంటే..
2010 నుంచి 2021 మధ్య వాణిజ్య, నివాస నిర్మాణ ప్రాంతాలు భారీగా పెరిగాయి. ఇంకా పెరుగుతోనే ఉన్నాయి. అంతా కాంక్రీట్ జంగిల్ మారిపోడం.. నీరు ఇనుకెందుకు మట్టి ఉపరితలం లేకపోడం నీటి కొరతకు కారణంగా చెబుతున్నారు. నీటి వనరుల కాలుష్యం కూడా నీటి కొరతకు కారణంగా చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 185 నోటిఫైడ్ వాటర్ బాడీలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డులు వెల్లడించాయి. దురదృష్టవశాత్తు ఈ నీటి వనరులలో ఎక్కు శాతం భారీగా కలుషితమయ్యాయి. అలాగే పలు నీటి వనరులను కబ్జా చేసి ఇళ్లు కూడా కట్టారు.
20కి పైగా నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో నీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.
అయితే ఇప్పటికైనా కళ్లు తెరిచి నీరు భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలనుంటున్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉపరితల వైశాల్యం ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి గుంటలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు భూగర్భ జలాలను పెంచుతాయన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications